ముఖ్యమంత్రి జగన్ మంచి లక్ష్యంతో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని.. ఆయన ఆలోచనలకు తగ్గట్లు పనిచేయాలని గుంటూరు జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. ప్రత్తిపాడు, వింజనంపాడు సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించారు.
గ్రామాల్లో జరిగే నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే సస్పెండ్ చేస్తామని ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ను జేసీ హెచ్చరించారు. సచివాలయంలోని ఉద్యోగులు ఏం చదివారు.. ఏ పోస్టుల్లో పనిచేస్తున్నారన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ టీం వర్క్ చేయాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రాల పిల్లలు ఎంతమంది పోషకాహార లోపంతో ఉన్నారు.. వారి పరిస్థితి ఏంటి అన్న విషయాలు తెలుసుకోవాలని చెప్పారు. ఉద్యోగులు 70 శాతం ఫీల్డ్ వర్క్, 30 శాతం ఆఫీస్ వర్క్ చేయాలని సూచించారు. గ్రామాల్లో సమస్యలు గుర్తించి పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు.
ఇవీ చదవండి: