ETV Bharat / state

నిజాంపట్నం హార్బర్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్

గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్ విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చజెండా ఊపాయి. రెండో దశ విస్తరణ పనులకు సంబంధించి నాబార్డు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు 2 రోజుల్లో ఒప్పందం చేసుకోనున్నారు. మొత్తం రూ. 341 కోట్ల రూపాయలతో విస్తరణ పనులు చేపట్టనున్నారు. దీంతో దశాబ్దాలుగా మత్స్యకారులు చూస్తున్న ఎదురుచూపులు ఫలించనున్నాయి.

guntur district nijampatnam harbour extension package
నిజాంపట్నం హార్బర్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్
author img

By

Published : Jul 8, 2020, 5:26 PM IST

చేపల వేటకు గుంటూరు జిల్లాలో నిజాంపట్నం హార్బర్ చాలా కీలకమైనది. ఇక్కడ ఏటా రూ. 350 కోట్ల రూపాయల మేర వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. నిజాంపట్నం హార్బర్ ప్రస్తుతం 60 బోట్ల సామర్థ్యంతో పనిచేస్తోంది. ఇక్కడ 275 మెకనైజ్డ్ బోట్లు ఉన్నాయి. తుపాన్ల సమయంలో రక్షణ కోసం కాకినాడ, నెల్లూరు, వేటపాలెం తదితర ప్రాంతాల బోట్లు నిజాంపట్నానికి వస్తాయి. బోట్లు నిలిపేందుకు అవసరమైన జెట్టీ సామర్థ్యం లేక ఒకదానినొకటి ఢీకొని దెబ్బతింటున్నాయి.

ప్రతిపాదనలకు ఆమోదం

కొన్నేళ్లుగా హార్బర్ విస్తరించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. అవి ఎట్టకేలకు ఇప్పుడు ఆమోదం పొందాయి. వ్యాప్కోన్ సంస్థ దీనికి సంబంధించి సవివరణ నివేదిక రూపొందించింది. విస్తరణకు కావాల్సిన భూమిని అటవీశాఖ నుంచి సేకరించారు. కేంద్రప్రభుత్వం సాగరమాల ప్రాజెక్టు క్రింద హార్బర్ విస్తరణకు అవసరమైన నిధులు మంజూరు చేయనుంది. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజినీరింగ్ ఫర్ ఫిషింగ్ ఆధ్వర్యంలో పనులు జరగనున్నాయి. మొత్తం రూ. 341 కోట్ల వ్యయంలో నాబార్డు రూ. 150 కోట్లు రుణంగా ఇవ్వనుంది. మిగతా మొత్తంలో కేంద్రం 90శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10శాతం భరించనున్నాయి.

నాబార్డు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధులు

హార్బర్​లో 300 మెకనైజ్డ్ బోట్లు నిలిచేలా జెట్టీని విస్తరించనున్నారు. దీంతోపాటు మౌలిక వసతులు కల్పిస్తారు. సముద్ర ముఖద్వారం నుంచి 500 మీటర్ల మేర మొగ... మరో 500 మీటర్ల మేర పొడవు పొడిగించాలని నిర్ణయించారు. దీనివల్ల హార్బర్ నుంచి సముద్రంలోకి బోట్ల రాకపోకలు సాగించటానికి ఇబ్బందులుండవు. మత్స్య సంపద నిల్వచేయటానికి శీతల గోదామును నిర్మించనున్నారు. హార్బర్లోనే ఆక్వా ఉత్పత్తుల గ్రేడింగ్​తో పాటు ప్యాకింగ్ చేసి ఎగుమతి చేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు.

మౌలిక వసతుల ఏర్పాటు

విస్తరణ పనుల్లో భాగంగా జెట్టీ విస్తరణ, మొగ సామర్థ్యం పెంచటం, హార్బర్​కు అనుసంధానంగా ఉన్న ఛానల్​లో డ్రెడ్జింగ్, అంతర్గత రహదారుల నిర్మాణం, బోటు పార్కింగ్ ప్రదేశం, చేపలు వేలం వేసే కేంద్రం ఏర్పాటు, తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్, వాహనాల పార్కింగ్ ప్రదేశం, వలలు ఎండబెట్టుకునే ప్రాంతం, మత్స్యకారులకు విశ్రాంతి గదులు, ఇంధనం సరఫరా, నిల్వ కేంద్రాలు, క్యాంటీన్, మరుగుదొడ్లు, మురుగునీరు శుద్ధిచేసే ప్లాంటు నిర్మిచనున్నారు. ప్రస్తుతం ఉన్న హార్బర్ ఇరుకుగా ఉండటం, బోట్లు ఎక్కువ కావటంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నామని... హార్బర్ విస్తరించే పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.

హార్బర్​లో మౌలిక వసతులు కల్పించటంతో పాటు ప్రాసెసింగ్ యూనిట్లు వస్తే ఇక్కడి నుంచి ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు పెరిగేందుకు అవకాశముంది. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవటమే కాకుండా రైతులు, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి.

ఇవీ చదవండి..

సున్నా వడ్డీ పథకంపై బకాయిలను సున్నా చేస్తున్నాం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.