గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో విద్యార్థుల వసతి గృహాల్లో తనిఖీలు చేసిన ఆర్.కే మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడంపై కలెక్టర్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. స్థానికంగా వార్డెన్లు లేకపోవడం గుర్తించిన శాసనసభ్యులు వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. గత ఐదేళ్లలలో వసతి గృహాలకు రావల్సిన నిధులు పక్కదారి పట్టాయన్నారు. ముఖ్యమంత్రి నివాసం ఉండే నియోజకవర్గంలోని వసతి గృహాలలో సమస్యలు ఉంటున్నాయంటే అది అధికారుల లోపమేనన్నారు. శాసనసభ సమావేశాలలో విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
ఇదీ చూడండి నేడు షీలా దీక్షిత్‌కు అంతిమ వీడ్కోలు