గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియటానికి ముందుగానే ప్రధాన పార్టీలు ప్రచారాన్నిహోరెత్తిస్తున్నాయి. అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇళ్లు, అపార్టుమెంట్లు, దుకాణాలు, కార్యాలయాలు, వాహనాలు...ఇలా ఎక్కడ ఓటర్లు కనిపించినా ప్రచారమే దృశ్యాలే కనిపిస్తున్ననాయి. తమకు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేస్తామంటూ తెదేపా, వైకాపా, భాజపా తరఫు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఇదీ చదవండి