స్థానిక సమస్యల పరిష్కారం కోసం... ప్రజలు వారు నివసించే ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల్లోని పరిపాలన కార్యదర్శిని సంప్రదించాలని గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ తెలియజేశారు. తన పర్యటనలో భాగంగా నగరంలోని 22, 27వ వార్డు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
సచివాలయ ఉద్యోగులు నిర్దేశిత సమయానికి ఆఫీస్‌కు వస్తున్నారా లేదా అని రిజిస్టర్లను తనిఖీ చేశారు. సెక్రెటరీలు, వాలంటీర్లు నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా ప్రజలకు సేవలను అందించాలని కమిషనర్ కోరారు.
ప్రభుత్వం అందించే సేవలు, ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను గ్రామ వార్డు సచివాలయం డాష్ బోర్డ్‌లోని నిర్దేశిత గడువులోపు పరిష్కరించేలా చూడాలని పరిపాలన కార్యదర్శికి ఆదేశించారు. నగర ప్రజలు.. నగర పాలక సంస్థ, మీ సేవ ద్వారా పొందే సేవల నిమిత్తం సంబంధిత వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: