- అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: నరసింగరావు
- రేపు జిల్లా కేంద్రాలు, పరిశ్రమల వద్ద ఎస్మా జీవో కాపీలు దహనం: నరసింగరావు
- ఈ నెల 9న జైల్ భరో నిర్వహిస్తాం: కార్మిక సంఘాల నేతలు
- ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాష్ట్ర బంద్ చేస్తాం: కార్మిక సంఘాల నేతలు
- లక్షా 4 వేల మంది మహిళలపై ఇలాంటి చర్యలు దుర్మార్గం: కార్మిక నేతలు
3.20 PM
- విజయవాడలో కార్మిక సంఘాల నేతల మీడియా సమావేశం
- పాల్గొన్న సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ నేతలు అంగన్వాడీలపై ఎస్మాను ఖండించిన కార్మిక సంఘాల నేతలు
- కార్మికులతో ఘర్షణ వైఖరి సరికాదు: కార్మిక సంఘాల నేతలు
- ప్రభుత్వ వైఖరి వల్ల 25 రోజులుగా సమ్మె: కార్మిక సంఘాల నేతలు
- నాలుగేళ్లుగా అన్ని వస్తువుల ధరలు పెరిగాయి: కార్మిక సంఘాల నేతలు
- ఇచ్చిన హామీ అమలుచేయాలనే అంగన్వాడీలు కోరుతున్నారు: నేతలు
- నాలుగు రోజులు చర్చించినా రూపాయి జీతం పెంచరా?: కార్మిక సంఘాల నేతలు
- కార్మికులు తిరగబడితే ఏమవుతుందో త్వరలో తెలుస్తుంది: సంఘాల నేతలు
- అంగన్వాడీల సమస్యను వెంటనే పరిష్కరించాలి: కార్మిక సంఘాల నేతలు
- లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం: కార్మిక సంఘాల నేతలు
1.39PM
- విజయవాడ ధర్నాచౌక్‌లో స్పృహతప్పి పడిన అంగన్వాడీ కార్మికురాలు
- నిరాహార దీక్ష శిబిరంలో స్పృహతప్పి పడిపోయిన అంగన్వాడీ కార్మికురాలు
- ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం రేగులపాడు వాసిగా గుర్తింపు
1.16PM
అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించటంను ఖండించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
- రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆగ్రహం
- ఎస్మా చట్టం ప్రయోగించడంను ఖండించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ
- సీఎం జగన్ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు: కే. రామకృష్ణ
- సిటింగ్ స్థానాలు మార్చినంత మాత్రాన కార్మికుల సమస్యలు పరిష్కారం కావు: కే. రామకృష్ణ
- కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఎమ్మెల్యేల స్థానాలు మార్చినంత మాత్రాన గెలవటం అసాధ్యం: కే. రామకృష్ణ
- ప్రజాతంత్ర వాదులంతా ప్రభుత్వ చర్యలను ఖండించాలని కోరుతున్నాం: కే. రామకృష్ణ
12.58PM
అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం, సమ్మె కాలానికి వేతనంలో కోత పెట్టడం.. జగన్ నియంత పోకడలకు పరాకాష్ట: నారా లోకేశ్
- అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుంది?: నారా లోకేశ్
- పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని శాంతియుత నిరసనలు తెలపడం కూడా నేరమేనా?: నారా లోకేశ్
- అంగన్వాడీ ఉద్యమం పై సైకో సర్కార్ ఉక్కుపాదం మోపడం దారుణం: నారా లోకేశ్
- అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం, సమ్మె కాలానికి వేతనంలో కోత పెట్టడం.. జగన్ నియంత పోకడలకు పరాకాష్ట: నారా లోకేశ్
- అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 2 తక్షణమే ఉపసంహరించుకోవాలి: నారా లోకేశ్
- అంగన్వాడీల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది: నారా లోకేశ్
- జగన్ అహంకారానికి.. అంగన్వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఉద్యమంలో అంతిమ విజయం అంగన్వాడీలదే: నారా లోకేశ్
12.45PM
ఎస్మా ప్రయోగంపై అంగన్వాడీల ఆగ్రహం
- రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడంపై అంగన్వాడీల ఆగ్రహం
- ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేసిన అంగన్వాడీలు
- సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె చేస్తాం: అంగన్వాడీలు
12.22PM
అంగన్వాడీలపై ఎస్మా అస్త్రం
- అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ
- అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెం.2 జారీ
- ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు
- సమ్మె చేసిన కాలానికి వేతనంలో తగ్గించేసిన ప్రభుత్వం
- అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు వేతనంలో కోత వేసిన ప్రభుత్వం
- అంగన్వాడీ వర్కర్లకు గత నెల వేతనం రూ.8,050 జమచేసిన ప్రభుత్వం
- వేతనంలో సుమారు రూ.3 వేలు కోత విధించి జమ చేసిన ప్రభుత్వం