ETV Bharat / state

ఆ మద్యం దుకాణంలో సిబ్బందే దొంగలు.. పట్టుకున్న సెబ్ అధికారులు - ప్రభుత్వ మద్యం అక్రమ తరలింపు

గుంటూరు జిల్లా తెనాలిలోని బోసు రోడ్డులో గల ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి.. 8 కేసుల్లో దాదాపు 400 మద్యం సీసాలను.. అక్కడ పనిచేస్తున్న సూపర్​వైజర్లే చోరీ చేశారు. ముందు నుంచే నిఘా పెట్టిన సెబ్ అధికారులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.

Government Liquor Smuggling Seized
పనిచేేసే సిబ్బందే అక్రమ తరలింపు
author img

By

Published : Jul 28, 2021, 9:25 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దశలవారీ మద్యపాన నిషేధానికి అనుగుణంగా.. పరిమిత ప్రాంతాల్లో మాత్రమే ప్రభుత్వమే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. కానీ.. ఆ దుకాణాల్లో పని చేసే కొందరు సిబ్బంది ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని బోసు రోడ్డులో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి సమీపంలోని బార్ షాపుకు అక్రమంగా తరలిస్తున్నారు.

దుకాణంలో పనిచేస్తున్న సూపర్​వైజర్లు మన్యం సూరిబాబు, అబ్దుల్ సాదిక్, బాల నారాయణ.. బార్​కి మద్యం సరఫరా చేశారు. ఈ దందాలో బార్ ఉద్యోగి వి. సత్యప్రసాద్ సమన్వయం చేశారు. సెబ్ అధికారులు వారిని రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. సహకరించిన ఆటోడ్రైవర్ సిహెచ్ విజయ్​ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా... ఐదుగురు నిందితులను రిమాండ్​కు తరలించినట్లు సూపరింటెండెంట్ నరసింహారావు తెలిపారు.

అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల మీద తమ నిఘా ఉందని చెప్పారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడానికి ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని... వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని నరసింహారావు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఇసుక దొంగలు.. వైకాపాకు చెందిన వారే: రాజధాని రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.