అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎన్నో పథకాలు అమలు చేసిన ఘనత ఒక్క సీఎం జగన్‌కే దక్కుతుందని తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి అన్నారు. విద్య, వైద్య రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతీ మండలానికి ఒక 108, 104 వాహనం అందిస్తున్నారన్నారు. నాడు - నేడు ద్వారా పాఠశాలలు అభివృద్ధి చేయిస్తున్నామని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్