గుంటూరులోని అమరావతి రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది. స్థానికంగా నివాసముంటున్న రవిబాబు.. సోమవారం ఉదయం నిద్రలేచి చూడగా ఇంటి తలుపులు, బీరువా తెరిచి ఉన్నాయి. బీరువాలో ఉన్న 44 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు ఫిర్యాదు చేయగా..అరుండలపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: వైఎస్ జలకళ పథకానికి సవరణలు.. ఉత్తర్వులు జారీ