ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. గుంటూరులోని జీజీహెచ్‌లో కొందరు ఉద్యోగుల కాసుల వేటలో నిమగ్నమయ్యారు. ఆస్పత్రిలో పడక కోసం రూ.5వేలు డిమాండ్ చేసి.. చివరకు 500 రూపాయలు ఇవ్వాలని రోగి బంధువును బొబ్బిలి శ్రీనివాసరావు అనే నాలుగో తరగతి ఉద్యోగి అభ్యర్థించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ ఘటన జిల్లా యంత్రాంగం దృష్టికి రావడంతో.. జాయింట్ కలెక్టర్ ప్రశాంతి అతడిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని జేసీ ప్రశాంతి హెచ్చరించారు. మరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పాత్రపైనా విచారణ జరిపాలని సూపరింటెండెంట్‌కు తెలిపారు.
ఇదీ చదవండి:
రోజులు బాగాలేవు జాగ్రత్త.. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా?