గుంటూరు జిల్లా నరసరావుపేటలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. వరుస దోపిడీలతో స్థానికులకు కునుకు లేకుండా చేస్తున్నారు. పట్టణంలోని శివుని బొమ్మ సెంటర్, స్టేషన్ రోడ్డులోని నాలుగు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. ఎంతో చాకచక్యంగా దుకాణాల షెటర్లను కింది నుంచి పగులగొట్టి దొంగతనం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం