ప్రతిపక్ష నేత చంద్రబాబు అమరావతి పర్యటన నేపథ్యంలో... ముఖ్యమంత్రి జగన్ రాజధానిపై ప్రకటన చేశారని మాజీమంత్రి పుల్లారావు పేర్కొన్నారు. గురువారం చంద్రబాబు అమరావతి పర్యటనపై రైతులు, తెదేపా నేతలతో గుంటూరు జిల్లా తుళ్లూరులో ఆయన సమావేశమయ్యారు. రాజధానిపై మంత్రులు తలో మాట చెబుతూ... రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. రైతులంతా సంఘటితంగా ఉండాలనీ... అన్నదాతలు చేసే ఏ పోరాటానికైనా అందరం అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
ఇవీ చదవండి..