గుంటూరు జిల్లాలో పెన్నా - గోదావరి నదుల అనుసంధానం ప్రాజెక్టు భూముల సర్వే కోసం వచ్చిన అధికారుల్ని రైతులు అడ్డుకున్నారు. రాజుపాలెం, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో అధికారులు సర్వే చేపట్టారు. ఎకరానికి ఎంత పరిహారం ఇస్తారో చెప్పకుండా సర్వే చేసేందుకు వీల్లేదని రైతులు స్పష్టం చేశారు.
సర్వే సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా.. ఆర్డీవో భాస్కరరెడ్డి అక్కడకు చేరుకున్నారు. ప్రస్తుతం సర్వే మాత్రమే జరుగుతోందని... భూమి తీసుకోవటం లేదని వివరించే ప్రయత్నం చేశారు. పరిహారం విషయం తేలాకే భూముల్లో అడుగు పెట్టాలన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న ధరకు రెండున్నర రెట్ల ప్రకారం పరిహారం అందుతుందని ఆర్డీవో తెలిపారు.
ఆ ప్రకారం ఎకరాకు 15 లక్షల మేర ఇస్తున్నామని చెప్పారు. అయితే ఎకరాకు 30లక్షలు ఇస్తేనే భూములు ఇచ్చే విషయం ఆలోచిస్తామని రైతులు తేల్చి చెప్పారు. వారి డిమాండ్‌పై వినతిపత్రం ఇవ్వాలని ఆర్డీవో సూచించారు. ఆ మేరకు రైతులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. విషయాన్ని కలెక్టర్‌కు నివేదించి పరిహారం ఎంతనేది నిర్ణయిస్తామని ఆర్డీవో భాస్కరరెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: