గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ..ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన నల్లమడ వాగు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పాదయాత్రగా గుంటూరు ఇరిగేషన్ ఎస్‌ఈ కార్యాలయానికి చేరుకున్న రైతులు అక్కడ నిరసన తెలిపారు. గుంటూరు ఛానల్ను పొడిగించాలని గత కొన్నేళ్లుగా వినతులు సమర్పించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ ఆవేదనను ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేసేందుకే పర్చూరు నుంచి పాదయాత్రగా గుంటూరు చేరుకున్నట్లు నల్లమడ వాగు రైతు సంఘం అధ్యక్షుడు కొల్లా రాజమోహన్ చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చేలా గుంటూరు ఛానల్ను పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఎస్‌ఈ కార్యాలయం అధికారులకు రైతులు వినతిపత్రం సమర్పించారు.
ఇదీ చదవండి
భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు రావచ్చు: ప్రభుత్వ సలహాదారు సజ్జల