రాజధానిలో అనుమతి లేకుండా మట్టి తవ్వడంపై రైతులు ఆగ్రహం (Amravati Farmers angry)వ్యక్తం చేశారు. తుళ్లూరు మండలం రాయపూడిలోని ఏపీఎన్ఆర్టీ భవన నిర్మాణానికి కేటాయించిన ప్రాంతంలో నల్ల మట్టిని కొంత మంది వ్యక్తులు తవ్వడంపై రైతులు అభ్యంతరం తెలిపారు. మట్టి తవ్వేందుకు ఉన్న అనుమతి పత్రాలు చూపించాలని రైతులు ప్రశ్నించగా.. సీఆర్డీఏ తమకు పర్మిషన్ ఇచ్చిందని వారు గుత్తేదారులు తెలిపారు. రాయపూడి ప్రాంతంలో నిర్మించే ఆస్పత్రి పునాదుల కోసం మట్టి తవ్వుతున్నామని గుత్తేదారులు చెప్పారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన పొలాల్లో మట్టి తవ్వడానికి వీలు లేదంటూ గట్టిగా చెప్పటంతో...అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇదీ చదవండి