గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డు వద్ద నిమ్మ రైతులు ఆందోళనకు దిగారు. పంట కొనుగోళ్లలో ఆన్లైన్ విధానం తప్పులతడకగా ఉందంటూ నిరసన చేపట్టారు. దీనిని పట్టించుకోని అధికారులు సాయంత్రం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ రాకతో... కర్షకులతో చర్చలు జరిపారు. ప్రభుత్వం తెచ్చిన విధానాలు అమలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని మార్కెటింగ్ శాఖ జేడీ రామాంజనేయులు అన్నారు. సమస్య పరిష్కరించే దిశగా మంత్రి, కమిషనర్‌తో చర్చలు జరుపుతానని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: