రాజధాని ఉద్యమంలో మరో రైతు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని తరలిపోతోందనే బాధతో తుళ్లూరుకు చెందిన జమ్ముల గోపాలరావు గుండెపోటుతో మృతిచెందారు. అమరావతి నిర్మాణానికి రైతు తనకున్న ఎకరం పొలాన్ని భూసమీకరణ కింద ప్రభుత్వానికి ఇచ్చారు. గత కొన్ని రోజులుగా తుళ్లూరులో జరుగుతున్న అమరావతి ఉద్యమంలో గోపాలరావు చురుగ్గా పాల్గొన్నారు. గోపాలరావు మృతి పట్ల తుళ్లూరు దీక్షా శిబిరంలో రైతులు సంతాపం ప్రకటించారు.
అమరావతి ఉద్యమం: ఆగిన మరో రైతు గుండె - AMARAVATHI LATEST NEWS
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. 359 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అమరావతి నిర్మాణం కోసం భూమిలిచ్చిన రైతుల ప్రాణాలుపోతున్న చలనం లేదని వాపోతున్నారు. తుళ్లూరులో ఓ రైతు గుండెపోటుతో చనిపోయారు. గోపాలరావు మృతితో దీక్షా శిబిరంలో రైతులు సంతాపం ప్రకటించారు.
రాజధాని ఉద్యమంలో గుండెపోటుతో రైతు మృతి