కరోనా సాకుతో ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి మినహాయింపులు లేకపోయినా కొంత మంది అధికారులు విధులకు డుమ్మాలు కొడుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఉప ఖజానా కార్యాలయంలో ఏడుగురు విధులు నిర్వహించాల్సి ఉండగా కేవలం ఒక్కరే ఉంటున్నారు. ఉప ఖజానా అధికారిణి విజయదుర్గ ఏకంగా ఏప్రిల్ 1 నుంచి విధులకు గైర్హాజరవుతున్నారు. ఏదైనా అత్యవసరం ఉంటే అటెండర్ ఇంటికి వెళ్లి సంతకం పెట్టించే పరిస్థితులు ఉన్నట్లు కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. మరోవైపు ఉప ఖజానా అధికారిణి విధులకు రాకపోవడంపై పింఛనుదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చదవండి: