ఏలేరు కాలువ ఉద్ధృతికి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట కట్టమూరు రహదారి పూర్తిగా దెబ్బతిన్నది. మండలంలో వివిధ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాండ్రకోట వద్ద మూడీగాళ్ల మొగ్గ కాలువకు గండి పడటంతో.. 1000 ఎకరాలు పంటకు సాగునీరు కష్టం అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలో కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు నీటి ఉద్ధృతికి దెబ్బతిన్న పంట పొలాలను కలెక్టర్ పరిశీలించారు. మండలంలో వేల ఎకరాలు నీట మునిగాయి.. ఆర్డీవో మల్లిబాబుతో కలిసి రాజుపాలెంలో పంట నష్టంపై చర్చించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో పడిన వర్షాల కారణంగా ఏలేశ్వరంలో ఉన్న ఏలేరు జలాశయానికి స్థాయిని మించి నీరు చేరడంతో ప్రాజెక్టు ఇరిగేషన్ అధికారులు గత రెండు రోజులుగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏలేరు పరివాహక ప్రాంత మండలాలకు సంబంధించిన పల్లపు ప్రాంతాలు, పంట భూములు నీట మునిగాయి. ఏలేశ్వరం మండలంలో ఎర్రవరం, పెద్దనాపల్లి గ్రామాలు కిర్లంపూడి, గొల్లప్రోలు, పిఠాపురం మండలంలో అధిక నష్టం వాటిల్లింది.
ఏలేశ్వరంలో ఉన్న అప్పనపాలెం బ్రిడ్జి ఏలేరు వరద నీటికి సోమవారం కుంగిపోయింది. జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, ప్రత్తిపాడు శాసనసభ్యులు పర్వతశ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్, ఏలేరు ఇరిగేషన్, పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులతో కలిసి అప్పనపాలెం బ్రిడ్జిను పరిశీలించారు. బ్రిడ్జ్ మీద ఎటువంటి రాకపోకలు సాగకుండా స్థానిక అధికారులు బారికేడ్లు నిర్మించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వీరితో పాటు ఆర్డీవో ఎస్.మల్లిబాబు, ఏలేరు పెద్దాపురం డివిజన్ డీఈ రామ్ గోపాల్, ఏలేరు ప్రాజెక్టు డీఈ ఆనంద్, జేఈ చౌదరి, తహసీల్దార్, ఎంపీడీఓ, ఇతర శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు వెళ్లారు
ఇదీ చూడండి. 'సంక్రాంతి నాటికి అంతర్వేది రథం సిద్ధం చేయాలి'