బండరాయితో వార్డు సచివాలయం అద్దాలు పగులగొట్టాడో తాగుబోతు. గుంటూరు జిల్లా నరసరావుపేట 3వ వార్డులో జరిగిందీ ఘటన. దిశ పోలీసుల సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో.. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మద్యం సేవించి అక్కడకు వచ్చినట్లు వాలంటీర్ నాగూర్ వలి తెలిపాడు.
ద్విచక్ర వాహనంపై వచ్చిన ఆ వ్యక్తి.. ఏర్పాట్లు చేస్తున్న ప్రాంతంలో మూత్ర విసర్జన చేయబోయాడని వాలంటీర్ పేర్కొన్నాడు. ఇక్కడ మూత్ర విసర్జన చేయవద్దని వారించినందుకు తనపై దాడి చేశాడని వాపోయాడు. అనంతరం బండరాయితో సచివాలయం కిటికీ అద్దాలను పగులగొట్టాడని వివరించాడు. ఘటనపై రెండవ పట్టణ పోలీసులకు పిర్యాదు చేసినట్లు వెల్లడించాడు.
ఇదీ చదవండి: గ్రామ సచివాలయాల్లోనే రవాణా శాఖ సేవలు