ETV Bharat / state

దొనకొండ-గజ్జలకొండ డబ్లింగ్ పనులు పూర్తి - south central railway

గుంటూరు రైల్వే డివిజన్​లోని దొనకొండ-గజ్జలకొండ మధ్య డబ్లింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ మార్గాన్ని రైల్వే సేఫ్టీ కమిషనర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మార్గం ద్వారా గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల ప్రజలకు రైలుప్రయాణం సులభమవుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మల్యా తెలిపారు.

Donakonda-Gajjalakonda railway doubling works
దొనకొండ-గజ్జలకొండ డబ్లింగ్ పనులు పూర్తి
author img

By

Published : Apr 2, 2021, 8:47 PM IST

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో దొనకొండ-గజ్జలకొండ మధ్య డబ్లింగ్ పనులు పూర్తయినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మల్యా ఓ ప్రకటనలో తెలిపారు. దొనకొండ-గజ్జలకొండ మధ్య 12.4 కిలోమీటర్ల డబుల్ లైన్​తో పాటు విద్యుదీకరణ పనులు పూర్తయినట్లు వివరించారు. ఈ మార్గాన్ని రైల్వే సేఫ్టీ కమిషనర్ పరిశీలించి 90 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించేందుకు అనుమతినిచ్చారు.

అందుబాటులోకి 81 కిలోమీటర్లు

ఆంధ్రా-రాయలసీమ ప్రాంతాలను అనుసంధానం చేయటంలో గుంటూరు-గుంతకల్ మార్గం ఎంతో కీలకం. ఈ మార్గంలో డబ్లింగ్, విద్యుదీకరణకు సంబంధించి ఇప్పటికే నల్లపాడు-సాతులూరు మధ్య 32కిలోమీటర్లు, డోన్-పెండేకల్లు మధ్య 36.6 కిలోమీటర్లు పూర్తయింది. ఇప్పుడు మరో 12.4 కిలోమీటర్లు పూర్తి కావటంతో మొత్తం 81 కిలోమీటర్లు రైలు మార్గం అందుబాటులోకి వచ్చినట్లు మల్యా వివరించారు.

సులువైన ప్రయాణం

ఈ మార్గం ద్వారా గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల ప్రజలకు రైలు ప్రయాణం మరింత సులువవుతుందని గజానన్ మల్యా అభిప్రాయపడ్డారు. పల్నాడు ప్రాంతంలో ఖనిజ సంపద రవాణాకు, గుంటూరు, విజయవాడ డివిజన్లలో రైళ్ల సంఖ్యను పెంచటానికి అవకాశాలుంటాయని తెలిపారు. పనులు పూర్తిచేసిన సిబ్బందిని గజానన్ మల్యా అభినందించారు.

ఇదీచదవండి.

వివేకా హత్య కేసులో సీఎం జగన్​ స్పందించాలి: గోరంట్ల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.