ETV Bharat / state

CULTIVATION: వైవిధ్య సాగు.. లాభాలు బాగు.. - యాపిల్​ రేగు

FRUITS: సంప్రదాయ పంటలతో ఆశించిన ఆదాయం రాకపోవడంతో రైతులు వైవిధ్య రకాల వైపు అడుగులేస్తున్నారు. ప్రయోగాలు చేసి మరీ ప్రత్యామ్నాయ పంటలను పరిచయం చేస్తున్నారు. అలా పరిచయమైన డ్రాగన్‌ ఫ్రూట్‌, యాపిల్‌ రేగు, ఖర్జూర ఇప్పుడు మిగతా రైతులనూ ఆకట్టుకుంటున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ పంటల సాగులో ఉన్న రైతుల అనుభవాలేంటో చూద్దాం.

DRAGON
DRAGON
author img

By

Published : Aug 7, 2022, 6:47 AM IST

FRUITS: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెంకు చెందిన పోలేశ్వరరావు 13 ఎకరాల్లో 12 రకాల డ్రాగన్‌ ఫ్రూట్‌ పండిస్తున్నారు. ఎకరాకు 10 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్లకు చెందిన దుర్గాభవాని 3 ఎకరాల్లో 2018లో డ్రాగన్‌ సాగు చేపట్టారు. మహారాష్ట్ర నుంచి మొక్కలు తెప్పించారు. రవాణా ఖర్చుతో కలిపి ఒక్కో మొక్కకు రూ.60 వెచ్చించారు. ఇప్పటిదాకా 20 నుంచి 25 టన్నుల దిగుబడి సాధించారు.

సాగు విధానం: భూమిలో పశువులు, కోళ్ల ఎరువులను వేస్తూ సేంద్రియ విధానంలో సాగు చేపట్టారు. జీవామృతాన్ని తయారుచేసి బిందుసేద్యంద్వారా మొక్కలకు అందిస్తున్నారు. పోలేశ్వరరావు సెన్సర్లతో వాతావరణంలోని తేమను పరిశీలించి నీటి యాజమాన్యం చేపడుతున్నారు.

మార్కెటింగ్‌: పోలేశ్వరరావు నేరుగా బెంగళూరు, దిల్లీ వ్యాపారులతో ఒప్పందం చేసుకుని విక్రయిస్తున్నారు. దుర్గాభవాని గత పంటను స్థానికంగా టోకున విక్రయించి ఎకరాకు రూ.8లక్షల ఆదాయం పొందారు.

అన్నదాత అనుభవం: ‘మొక్కలు నాటేటప్పుడే పందిళ్లు, స్తంభాలు, కూలీలకు ఖర్చులు ఎక్కువ ఉంటాయి. పంట కాపు వచ్చాక ఏడాదికి ఓ సారి కొమ్మలు కత్తిరింపు చేస్తే సరి. ఎడారి మొక్కలు కావడంతో వాతావరణ మార్పులు తట్టుకుంటున్నాయి. మార్కెట్లో ఆర్గానిక్‌ పండ్లకు డిమాండు ఉండటంతో సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నాం. దీంతో ఏటా అంతర కృషికి రూ.2లక్షలు ఖర్చవుతోంది. ఆ మేరకు ఆదాయమూ వస్తోంది’ అని రైతుల వివరించారు.

ఖర్జూరలో ప్రయోగాలు

కారంపూడి, ఫిరంగిపురం, మార్టూరు తదితర ప్రాంతాల్లో ఔత్సాహిక రైతులు ఖర్జూరను సాగులోకి తెచ్చి, ప్రయోగాలు చేస్తున్నారు. తమిళనాడులోని ధర్మపురి నుంచి మొక్కలను సేకరిస్తున్నారు. కొండలు, ఎర్ర నేలలు కలిగిన ప్రాంతాల్లో ఖర్జూర పంటను సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.

సాగు విధానం
ఎకరాకు 75 ఆడ మొక్కలు, 10 మగ మొక్కలు నాటుకోవాలి. దీనివల్ల పాలినేషన్‌ సక్రమంగా జరుగుతుంది. కాయలు పక్వానికి వచ్చే దశను జాగ్రత్తగా గమనించాలి. సమగ్ర సాగుపై మరింత అవగాహన రావాల్సి ఉంది. ఒకసారి నాటితే 50ఏళ్లకుపైగా పంట ఉంటుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వేసవిలో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఈ పంటకు కలిసొచ్చే అంశమని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.

మార్కెటింగ్‌: కొందరు మార్కెటింగ్‌ సైతం చేస్తున్నారు.

రైతుల అనుభవం: ‘కిలో రూ.150లకు తగ్గకుండా ఉంటే రైతులకు లాభదాయకం. తగినంత ప్రచారం లేక మార్కెటింగ్‌లో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి’ అని కారంపూడి మండలంలో ఖర్జూర సాగుచేస్తున్న బాషా తెలిపారు.

యాపిల్‌ రేగు: సొంత విక్రయాలు మేలు!

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడుకు చెందిన గుంటుపల్లి దేవేంద్రబాబు ఆరేళ్ల కిందట యాపిల్‌ రేగును 1.4 ఎకరాల్లో సాగుచేశారు. వికారాబాద్‌ నుంచి మొక్కలు తెచ్చి ఎకరాకు 420 నాటారు. 6 నెలల మొక్క రవాణా ఛార్జీలతో కలిపి రూ.70లకు వెచ్చించారు. ఏటా అక్టోబరు నుంచి జనవరి వరకు పంట చేతికొస్తోంది. ఎకరాకు 10టన్నుల దిగుబడి వస్తోంది.

సాగు విధానం: తోటకు ఏటా 10 టన్నుల పశువుల ఎరువు వేస్తున్నారు. పురుగు నివారణకు రసాయనాలను చల్లుతున్నారు. ఏటా కొమ్మల కత్తిరింపు మినహా పెద్దగా పని ఉండదు. అందుకే కూలీల ఖర్చూ పెద్దగా ఉండదు. ఎకరాకు సగటున రూ.2లక్షల ఆదాయం పొందుతున్నారు.

మార్కెంటింగ్‌: తోటదగ్గరే కిలోరూ.40లకు విక్రయిస్తున్నారు.

అన్నదాత అనుభవం: ‘బహిరంగ మార్కెట్‌లో చిల్లరగా కిలో రూ.80లకు అమ్ముతుండగా రైతుకు రూ.15లు కూడా రావడం లేదు. సొంతంగా మార్కెట్‌ చేసుకోగలిగితేనే లాభదాయకం. నగరాలకు దగ్గర సాగు చేసి, వేగంగా మార్కెట్‌ చేయడం కీలకం’ అని దేవేంద్రబాబు వివరిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.