ETV Bharat / state

Kona Raghupathi: '30న వైద్య కళాశాల, బోధనాసుపత్రులకు సీఎం శంకుస్థాపన' - బాపట్ల మెడికల్ కాలేజ్​కు శంకుస్థాపన చేయనున్న సీఎం వార్తలు

ఈనెల 30న బాపట్లలో వైద్య కళాశాల, బోధనాసుపత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు ఉప సభాపతి కోన రఘుపతి తెలిపారు. బాపట్ల జిల్లా కేంద్రంగా ఏర్పాటు కానున్న తరుణంలో.. ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందనుందని అభిప్రాయపడ్డారు.

Deputy Speaker Kona Raghupathi
ఉప సభాపతి కోన రఘుపతి
author img

By

Published : May 28, 2021, 1:05 PM IST

గుంటూరు జిల్లా బాపట్లలో వైద్య కళాశాల, బోధనాసుపత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈనెల 30న శంకుస్థాపన చేయనున్నట్లు ఉప సభాపతి కోన రఘుపతి(Kona Raghupati) తెలిపారు. వైద్య కళాశాల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంగా ఏర్పాటు కానున్న తరుణంలో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందనుందని అభిప్రాయపడ్డారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. దీనికి నాబార్డు నుంచి నిధులు మంజూరు చేసేందుకు ఆ సంస్థ ఛైర్మన్ చింతల గోవిందరాజులు కూడా అంగీకరించినట్లు తెలిపారు. గుంటూరులోని యూనివర్శిటిని తరలించేందుకు ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా ఉన్నారని కోన రఘుపతి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి...

House arrest: వినుకొండలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గృహనిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.