గుంటూరు జిల్లా ప్రత్తిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలను డీఈఓ గంగాభవాని పరిశీలించారు. ఈనెల 8వ తేదీన అక్కడ జగనన్న విద్యాకానుక కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో డీఈఓ ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం హోంమంత్రి సుచరిత విద్యాకానుక కార్యక్రమలో పాల్గొంటారని ఆమె తెలిపారు. ఇప్పటికే అన్ని మండలాలకు విద్యాకానుక సామగ్రి పంపిణీ చేసినట్లు చెప్పారు.
ఇవీ చదవండి..