గుంటూరు జిల్లా చేబ్రోలులో మాతా శిశు కేంద్రాన్ని అధికారులు కూల్చి వేయటంపై పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మండిపడ్డారు. పంచాయతీ నిధులు 8 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ కేంద్రాన్ని అధికారులు బాధ్యతారాహిత్యంగా కూల్చివేయడం దారుణమన్నారు. ధ్వంసమైన భవనాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ప్రతి నెలా మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల ఉపాధ్యాయులు, ఆయాలు ఈ భవనంలోనే సమావేశాలు నిర్వహించుకునేవారని నరేంద్ర కుమార్ గుర్తు చేశారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి
'శ్రీదేవి అక్కా.. పేకాట గురించి మాట్లాడలేదని ప్రమాణం చేస్తారా?'