ETV Bharat / state

తెనాలిలో పెరుగుతున్న నేరాలు.. ఆందోళనలో జనాలు - గుంటూరు జిల్లాలో నేరాలు తాజా

చిన్నపాటి గొడవలు, మనస్పర్థలు.. వాటికి ఆవేశాలు తోడవుతున్న ఫలితంగా.. నిండు ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో పది రోజుల వ్యవధిలో నాలుగు హత్యలు, రెండు హత్యాయాత్నాలు జరగడం స్థానికులను కలవరపాటుకు గురిచేస్తుంది. హత్యలు జరిగిన ఉదంతాలు చూస్తే అన్నింటిలోనూ చిన్న చిన్న అంశాలే కారణాలుగా కనిపిస్తున్నాయి. క్షణికావేశంలో.. తొందరపాటు నిర్ణయాలు, మద్యం మత్తులో జరిగినవే. ఈ క్రమంలో ఏమి తెలియని పసిపిల్లలు అనాధలుగా మిగిలిపోతున్నారు. వారి ఆలనాపాలనా చూసే వారు లేక నానా అవస్థలు పడుతున్నారు.

crime-rate
crime-rate
author img

By

Published : Oct 28, 2020, 6:34 PM IST

గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఇటీవల చోటు చేసుకున్న వరుస హత్యల ఉదంతాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. వరుస హత్యలు, దాడులతో ప్రజలు ఉలికి పాటుకు గురవుతున్నారు. గడిచిన కొద్దిరోజుల్లో చూసుకుంటే.. తెనాలిలో ఆరుగురిపై హత్యాయత్నాలు జరిగాయి. ఈ ఘటనల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు గాయాలతో బతికి బయటపడ్డారు.

ఈ నెల 14న కొలకలూరులో అన్నను తమ్ముడు దారుణంగా కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణానికి కుటుంబ కలహాలే కారణంగా తేలింది.

మరుసటి రోజు 15వ తేదీన నందివెలుగు జాషువా నగర్​లో భార్యపై అనుమానంతో భర్త ఆమెను ఉరివేసి హత్య చేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పోలీసులు పసిగట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

ఈ నెల 20న తెనాలి పట్టణం సుల్తానాబాద్​లో ఇంట్లో నిద్రిస్తున్న చంద్ర నాయక్​ను అర్ధరాత్రి విచక్షణా రహితంగా కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు. చంద్రనాయక్ భార్య జ్యోతి అక్క కొడుకు సాయి ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది.

23వ తేదీన మారిస్ పేటలో వియ్యంకుడు, వియ్యంకురాలిపై అల్లుడి తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. పండుగకు కుమార్తె ఇంటికి వచ్చిన వారిపై మామ కత్తితో దాడి చేసి గాయపరిచారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.

23వ తేదీ అర్ధరాత్రి తెనాలి నందులపేటలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో.. తీసుకున్నఅప్పు చెల్లించలేదని దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు.

వరుసగా జరుగుతున్న హత్యలు, దాడులతో ప్రశాంతంగా ఉండే తెనాలిలో అలజడి రేగుతోంది. చిన్నచిన్న వివాదాలు సైతం చాలా తేలికగా హత్యలకు దారితీస్తున్నాయి. తెనాలి మండలం కొలకలూరులో జరిగిన హత్య కారణంగా మృతుని తల్లి, భార్య అనాథలుగా మారారు. కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి విగత జీవుడిగా మారడంతో వారి పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది.

నందివెలుగు ఘటనలో ఇద్దరు చిన్నారులు తల్లికి దూరమయ్యారు. సుల్తానాబాద్ ఘటనతో భార్య, ఇద్దరు పిల్లలు కుటుంబ పెద్దను కోల్పోయారు. నందులపేటలో హత్య కారణంగా వృద్దురాలైన తల్లి మలి వయస్సులో ఆసరాను కోల్పోయింది. వరుస ఘటనలతో.. పోలీసులు నేరాల నియంత్రణకు మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

రైతులకు కనీస మద్దతు ధర కచ్చితంగా ఇవ్వాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.