ETV Bharat / state

గ్రూప్ 2, 3 ఉద్యోగాల నియామకానికి కంప్యూటర్ ప్రోఫీషియన్సీ సర్టిఫికెట్ తప్పనిసరి - గ్రూప్‌ల పోస్ట్‌ల కోసం సిప్ట్ టెస్ట్

CPT Test For Groups : రాష్ట్రంలో నిర్వహించే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల నియామకానికి కంప్యూటర్ ప్రోఫీషియన్సీ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీసుల్లో నియామకానికి అవకాశం లేదంటూ.. అడహాక్ నిబంధనలు జారీ చేశారు.

APPSC
ఏపీపీఎస్సీ
author img

By

Published : Feb 25, 2023, 5:10 PM IST

CPT Test For Groups : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే గ్రూప్ 2, 3 ఉద్యోగాల నియామకానికి ఇక నుంచి కంప్యూటర్ ప్రోఫీషియన్సీ సర్టిఫికెట్​ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇక నుంచి ఏపీపీఎస్సీ లేదా ఏపీ సాంకేతిక విద్యా బోర్డు నిర్వహించే సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండా గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీసుల్లో నియామకానికి అవకాశం లేదంటూ.. అడహాక్ నిబంధనలు జారీ చేశారు.

డైరెక్ట్ రిక్రూట్​మెంట్ ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా సీపీటీ (కంప్యూటర్ ప్రోఫిషియన్సీ టెస్టు) పాస్ కావాల్సిందేనని స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. వంద మార్కులకు గానూ కంప్యూటర్ ప్రోఫీషియన్సీ టెస్టు నిర్వహించనున్నట్టు సాధారణ పరిపాలనా శాఖ సర్వీసెస్ విభాగం పేర్కొంది.

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు కనీసంగా 30 మార్కులు, బీసీలకు 35, ఓసీలకు 40 మార్కులను సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కంప్యూటర్​లు, డిజిటల్ పరికరాలు, వివిధ రకాల ఆపరేటింగ్ సిస్టంలు, విండోస్, ఇంటర్నెట్ తదితర అంశాల్లో పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్ఫష్టం చేస్తూ ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే గ్రూప్ 1 సర్వీసు ఉద్యోగాలకు ఈ తాత్కాలిక నిబంధన వర్తించదని పేర్కొంటూ సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్ కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వులు విడుదల చేశారు.

ఐతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్లు మాత్రమే ఉండేలా మార్పులు చేస్తూ ఆ శాఖ మానవ వనరుల విభాగం కార్యదర్శి చిరంజీవి చౌదరి ఉత్తర్వులు ఇచ్చారు. గత విధానం తరహాలోనే ప్రిలిమినరీ పరీక్షలో.. 150 మార్కులకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే మెయిన్స్​లో 450 మార్కులకు 3 పేపర్లు బదులుగా. 300 మార్కులకు రెండు పేపర్లు ఉండేలా మార్పులు చేశారు.

ఈమేరకు ఏపీపీఎస్సీ బోర్డు సభ్యులు చేసిన సిఫార్సుల మేరకు ఈ మార్పు చేర్పులు చేసినట్టుగా ప్రభుత్వం తెలియచేసింది. గ్రూప్ 2 మెయిన్స్​లో ఏపీ సామాజిక చరిత్ర, ఉద్యమాలు, భారతరాజ్యాగం పేపర్​ 1గా 150 మార్కులకు ప్రశ్నాపత్రం ఉండనుంది. అలాగే మరో 150 మార్కులకు రెండో ప్రశ్నాపత్రంగా భారత, ఏపీ ఎకానమి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుందని ప్రభుత్వం పేర్కోంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.