cpm mahasabhalu: రేపటి నుంచి మూడ్రోజుల పాటు సీపీఎం రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతోంది. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి సీఎస్‌ఆర్ కల్యాణ మండపంలో మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారాట్, బీవీ రాఘవులు హాజరుకానున్నారు. మూడేళ్లకోసారి జరిగే సభలు.. కరోనా కారణంగా గతేడాది వాయిదా పడ్డాయి. నాలుగేళ్లలో పార్టీ చేసిన ఉద్యమాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సభల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సీపీఎం నాయకులు చెబుతున్నారు. అలాగే వివిధ రాజకీయ అంశాలపై సభలో తీర్మానాలు చేసే అవకాశం ఉందని సమాచారం.
ఇదీ చూడండి:
good governance ranks : గుడ్ గవర్నెన్స్ సూచీలో ఏపీ స్థానం ఎంతో తెలుసా..