CPI, CPM protested across the state: ఉద్యోగ, ఉపాధ్యాయులపై వైఎస్సార్సీపీ సర్కార్ అవలంబిస్తున్న నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ఊధృతం అయ్యాయి. అనంతపురం గాంధీ విగ్రహం వద్ద వామపక్ష నేతలు నిరసన తెలిపారు. క్లాక్ టవర్ నుంచి గాంధీ విగ్రహం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన వేధింపులను ఆపాలని డిమాండ్ చేస్తూ.. వారికి ఇచ్చిన హామీల నెరవేర్చకుండా వారిపై కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమని సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని కోరారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి నియంత పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని కడప సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర పిలుపునిచ్చారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ కడప ఆర్డీవో కార్యాలయం కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మోసపూరిత హామీలతో ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపిస్తూ.... విజయవాడ ధర్నా చౌక్ వద్ద వామపక్ష నాయకులు ధర్నా చేశారు. ఉద్యోగులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమని గుంటూరు స్థానిక శంకర్ విలాస్ సెంటర్లో సీపీఐ, సీపీఎం నిరసన తెలిపారు. ఉద్యోగులపై ప్రభుత్వ వేధింపులను ఆపాలని డిమాండ్ చేస్తూ విశాఖలో వామపక్షాలు ఆందోళన చేపట్టాయి.
రాష్ట్రంలో సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర పిలుపునిచ్చారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం చాలా దారుణమని ఆయన మండిపడ్డారు. జీతాల కోసం ఆందోళనలు చేస్తే ముందస్తు అరెస్టులు చేయడం దుర్మార్గమని ఆయన ఖండించారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్త జీతాలు పెంచాల్సింది పోనిచ్చి ఉన్న జీతాలను తగ్గించి ఉద్యోగుల ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటమాటాడటం తగదని ఖండించారు. ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు పోలీసులకు ఇవ్వాల్సిన పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాలు అవుతున్న కూడా సిపిఎస్ ను రద్దు చేయకపోగా, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించలేదని ఆరోపించారు. పిఎఫ్ డబ్బులను జమ చేయాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయులను మానసికంగా వేధిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయ పోలీసులకు ఇవ్వాల్సిన బకాయిలన్నింటిని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సర్కార్‌పై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక విధానాలను విడనాడాలని ఆరోపించారు.
ఇవీ చదవండి: