కరోనా కేసుల నేపథ్యంలో కీలకమైన 104 కాల్ సెంటర్‌పై గుంటూరు జిల్లా కొవిడ్ ప్రత్యేక అధికారి ఉషారాణి సమీక్ష నిర్వహించారు. 104 కాల్ సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులు, వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకుని వారికి కావాల్సిన సలహాలు, కొవిడ్ పరీక్షలు, ఆస్పత్రుల సమాచారం అందించాలని ఉషారాణి ఆదేశించారు.
లక్షణాలను బట్టి హోం ఐసోలేషన్‌కు పంపి.. కిట్ ఇవ్వడం, కొవిడ్ కోర్ సెంటర్‌కు వెళ్లదగినవారిని 1089 వాహనం ద్వారా పంపడం, జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలుంటే ఆస్పత్రికి చేర్చడంపై సూచనలు జారీ చేశారు. పాజిటివ్ కేసుల ప్రైమరీ కాంట్రాక్టు వ్యక్తులను గుర్తించి త్వరితగతిన పరీక్షలు చేయడం, దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు సమాచారం అందించాలని ఉషారాణి ఆదేశించారు. 104 కాల్ సెంటర్ మరింత క్రియాశీలంగా పని చేయాలని కోరారు. పెండింగ్ అభ్యర్థనలను తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి