ETV Bharat / state

సత్తెనపల్లి ఆర్టీసీ బస్టాండ్​లో కొవిడ్ బాధితుల పడిగాపులు - coron news guntur district

సత్తెనపల్లిలో కరోనా పాజిటివ్ రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారుల సమన్వయలేమితో సుమారు 5 గంటలపాటు ఆర్టీసీ బస్టాండ్ లో పడిగాపులు పడ్డారు.

covid patients waiting at satthenapally bus stand guntur district
ఆర్టీసీ బస్టాండ్​లో కొవిడ్ బాధితుల పడిగాపులు
author img

By

Published : Jul 24, 2020, 7:07 AM IST

సత్తెనపల్లి ఆర్టీసీ బస్టాండ్​లో కొవిడ్ బాధితుల పడిగాపులు

గుంటూరు జిల్లాలో అధికారుల సమన్వయ లేమితో కరోనా పాజిటివ్ రోగులు ఇబ్బందులు పడ్డారు. సత్తెనపల్లిలో కరోనా పాజిటివ్ వచ్చిన 30 మందిని కొవిడ్ కేంద్రానికి తరలించాలని అధికారులు నిర్ణయించారు. వారిందరిని ఆర్టీసీ బస్టాండ్ కు రమ్మని సమాచారం ఇవ్వగా అక్కడికే చేరుకున్న బాధితులు సుమారు 5 గంటలపాటు పడిగాపులు పడ్డారు.

అయితే కొవిడ్ కేర్ కేంద్రంలో ఖాళీ లేదని..ఇంటికి వెళ్లి శుక్రవారం ఉదయం రమ్మని అధికారులు సమాచారం ఇచ్చారు. ఇళ్లకు వెళ్తే కుటుంబ సభ్యులకు ఇబ్బందవుతుందని బాధితులు అందోళన చెందారు. గంటలపాటు తమను రోడ్డుపై ఉంచడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ రోగులకు తీసుకెళ్లేందుకు బస్సులు సిద్దంగా ఉన్న అధికారుల నుంచి అనుమతి రాకపోవటంతో అలాగే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి రాత్రి 9.30 గంటల సమయంలో అధికారులు వారిని కాటూరి ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: గోనె సంచిలో మృతదేహం... గుంటూరులో కలకలం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.