కరోనాను తరిమికొట్టే దిశగా నిమ్స్ ఆస్పత్రిలో కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ వాక్సిన్ తొలి దశ ట్రయల్స్‌లో భాగంగా... నేడు మరికొంత మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఇద్దరు వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. పూర్తి ఆరోగ్యంతో ఉండటంతో వారిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో మరికొందరు వాలంటీర్లకు ఫేస్-1 డోస్ ఇవ్వనున్నట్లు నిమ్స్ వైద్యులు వెల్లడించారు.
ఇదీ చదవండి: సుగంధిం.. పుష్టి వర్ధనం