ETV Bharat / state

రోడ్లు మూశారు..అంబులెన్స్​ రాలేక విశ్రాంత హెడ్​కానిస్టేబుల్​ మృతి - మంగళగిరిలో కరోనా ఎపెక్ట్

కరోనా మహమ్మారి బారినపడి ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఈ వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో రోడ్లను మూసివేస్తున్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి సకాలంలో చికిత్స అందక ప్రాణాలను వదలుతున్నారు. ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగింది.

కరోనా ఎఫెక్ట్: గుండెపోటుతో హెడ్​కానిస్టేబుల్​ మృతి

author img

By

Published : Aug 3, 2020, 8:23 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి ఎల్బీనగర్​లో విషాదం జరిగింది. ఈ ప్రాంతంలో పాజిటివ్ కేసులు పెరగటంతో ఎక్కడికక్కడి రోడ్లను పురపాలక శాఖ అధికారులు మూసేశారు. ఎల్బీ నగర్ ప్రాంతంలో సుమారు 60 శాతం విశ్రాంత ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఓ విశ్రాంత హెడ్ కానిస్టేబుల్​కు గుండెపోటు రావడంతో అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అది వచ్చే దారి లేకపోవడంతో రావడానికి నిరాకరించారు. దీంతో సోమవారం తెల్లవారు జామున హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు.

కొవిడ్ పేరుతో పురపాలక అధికారులు సిమెంట్ రహదారులు మూసేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో అంబులెన్స్ వచ్చి ఉంటే తమ తండ్రి బతికి ఉండేవారని విశ్రాంత హెడ్ కానిస్టేబుల్ కుమారులు తెలిపారు.

ఇవీ చదవండి

అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ సీపీఐ ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.