గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ పరిధిలో కరోనా ప్రభావం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో కేసుల సంఖ్య 150కు చేరుకుంది. ఇందులో తెనాలి పట్టణంలో 90 ఉండగా.. గ్రామాల్లో 60 నమోదయ్యాయి.
తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి ఆర్.ఎం.వో ప్రేమ్ కుమార్ కరోనా బారినపడి మృతిచెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 4 రోజుల క్రితం ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ కాగా... కాటూరి ఆసుపత్రికి... అక్కడి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమించటంతో మంగళవారం సాయంత్రం విజయవాడలోని కొవిడ్ ప్రత్యేక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించారు. తెనాలి మున్సిపల్ కమిషనర్ కూడా వైరస్ బారిన పడ్డారు. ఆయన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగికి కరోనా సోకగా... ఆయన పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.
కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చిన తెనాలికి చెందిన డ్రైవర్‌కు మొదటగా పాజిటివ్ వచ్చింది. అలా అలా నియోజకవర్గంలో వైరస్ వ్యాప్తి చెందింది. పట్టణం నుంచి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చేవారికి కూడా కరోనా సోకింది. వారి ద్వారా మరికొందరికి వ్యాపించింది. ఇలా 40 రోజుల్లోనే కేసుల సంఖ్య 150కు చేరుకుంది.
ఇవీ చదవండి...