ETV Bharat / state

గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి.. వెయ్యి దాటిన కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు వెయ్యి దాటాయి. పాజిటివ్ కేసుల సంఖ్యా పరంగా చూస్తే జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉంది. గుంటూరు నగరంతో పాటు నరసరావుపేట, తాడేపల్లి, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో వైరస్ ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు కేసుల నమోదును బట్టి తెలుస్తోంది. పరీక్షల సంఖ్యను పెంచటం ద్వారా వైరస్ భారిన పడిన వారిని వెంటనే గుర్తించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో 75వేల మందికి పరీక్షలు నిర్వహించారు.

author img

By

Published : Jun 25, 2020, 8:03 AM IST

corona cases in guntur district
గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి.

గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే జిల్లాలో 70 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య ఒక 1,035కు చేరింది. కొత్త కేసుల్లో నగరంలో 27 కేసులు వచ్చినట్లు తెలిపారు. తెనాలిలో 13, తాడేపల్లి 12, నరసరావుపేట 3, మాచర్ల 2, మంగళగిరి 6, బాపట్ల 2 పాజిటివ్ కేసులు వచ్చాయి. సత్తెనపల్లి, నంబూరు, నిజాంపట్నం, పెదనందిపాడు, కనపర్రు, రేవేంద్రపాడులో ఒకటి చొప్పున నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

నగరంలోనే ఎక్కువ

పాజిటివ్​గా తేలిన వారిలో 10మంది ఇప్పటికే క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. గుంటూరు నగరంలో అంకిరెడ్డి పాలెంలో 2, డి.యస్.నగర్ 1, వెంకట రామయ్య కాలనీ 1, ఏ.టీ అగ్రహారం 1, పట్టాభిపురం 2, ఆర్టీసీ కాలనీ 1 , కేవీపీ కాలనీ 1, గుండరావుపేట 1, నల్లచెరువు 1, ఐపీడీ కాలనీ 6, కాటూరి మెడికల్ కాలేజ్ క్వారెంటైన్ 3, బృందావన్ గార్డెన్స్ 1, సంగడిగుంట 3, లాలపేట 1, చౌడవరం 1, శ్యామలా నగర్​లో 1 కేసు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి గుంటూరు నగరంలో కేసుల సంఖ్య 367, నర్సరావుపేటలో 225, తాడేపల్లిలో 109 కు చేరుకుంది. మిగతా మండలాల్లో 334 కేసులున్నాయి.

లాక్ డౌన్ సడలిస్తున్న కొద్దీ పెరుగుతున్న కేసులు

జిల్లాలో కేసుల తీవ్రత జూన్ నెలలో విపరీతంగా పెరిగింది. గత 24 రోజుల్లో 563 కేసులు నమోదయ్యాయి. మొదటి వారంలో 83, రెండో వారంలో 132, మూడో వారంలో 255, ప్రస్తుతం నాలుగో వారంలో ఇప్పటి వరరూ 93 మంది పాజిటివ్​గా తేలారు. లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తున్న కొద్దీ కేసుల తీవ్రత పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

విస్తృతంగా పరీక్షలు

జిల్లాలో ఇప్పటి వరకూ 75,468 మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో 68,604 మంది నెగెటివ్​గా తేలారు. ఇంకా 6వేలకు పైగా నివేదికలు రావాల్సి ఉంది. కరోనా కారణంగా జిల్లాలో ఇప్పటి వరకూ 14 మంది మరణించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొంది 577 మంది ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా నుంచి కోలుకున్నవారి శాతం 53.72గా ఉంది. ప్రతి 10లక్షల మందిలో 15,465 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 13 క్వారంటైన్ కేంద్రాలు ఉండగా అందులో వెయ్యి మంది ఉన్నారు. ఇప్పటి వరకూ 6,411 మంది క్వారంటైన్ కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లారు.

ఇవీ చదవండి...

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. చీకటైపోయిన జీవితాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.