ETV Bharat / state

జిల్లాలో కొత్తగా 4 కేసులు.. కొత్త ప్రాంతాల్లో ఇద్దరికి కరోనా - గుంటూరులో కరోనా తాజా వార్తలు

గుంటూరు నేడు నమోదైన 4 కేసులతో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 436కు చేరుకుంది. ఇదివరకు కేసులు లేని కొత్త ప్రాంతాల్లో పాజిటివ్​లు నిర్ధరణ అవ్వటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

corona cases in guntur district
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు
author img

By

Published : May 23, 2020, 5:07 PM IST

గుంటూరు జిల్లాలో మరో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 436కు చేరింది. కొత్తగా వచ్చిన కేసుల్లో నరసరావుపేటలోని వరువకట్టలో 2, గుంటూరు నగరంలోని కొండా వెంకటప్పయ్య కాలనీలో 1, దుగ్గిరాల మండలం చింతలపూడిలో ఒక కేసు వెలుగు చూశాయి. వీటితో కలిపి.. గుంటూరులో 179, నరసరావుపేటలో కేసులు 187కు చేరుకున్నాయి.

నగరంలోని కొండా వెంకటప్పయ్య కాలనీలో వ్యక్తికి కరోనా ఎలా సోకిందో తేలాల్సి ఉంది. చింతలపూడిలో కొవిడ్ సోకిన వ్యక్తి... ఇటీవలే పెనుమాకలో పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్ట్​గా అధికారులు తెలిపారు. కొత్త ప్రాంతాల్లో 2 కేసులు నమోదు కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేశారు. పాజిటివ్ వచ్చిన వారు ఎవరెవరిని కలిశారో ఆరా తీస్తున్నారు.

ఇవీ చదవండి:

అగ్రరాజ్యం నేవీలో.. తెలుగు తేజం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.