గుంటూరు జీజీహెచ్ ఎదుట ఒప్పంద స్టాఫ్‌నర్సులు ఆందోళన నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 3వ రోజు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం కొవిడ్ విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి.. కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్‌నర్సుల పట్ల సానుకూలంగా స్పందించి రెగ్యులర్ చేయాలని కోరారు.
కొవిడ్ రోగులకు సేవలు అందిస్తూ అసువులు బాసిన స్టాఫ్‌నర్సుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలన్నారు. ఒప్పంద స్టాఫ్‌నర్సుల సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజులలో నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: