గుంటూరు జిల్లా అంచులవారిపాలెంలో 4 సెంట్ల స్థలంలోని పశువుల కొట్టం విషయంలో బావ, బావమరుదులు అయిన గలబ బసవయ్య, వేపూరి శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ కాస్త చినికి చినికి గాలివానై ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గ్రామంలోని అనేక మంది పరస్పరం రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారన్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ కారణంగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
ఘర్షణలో ఇరువర్గాలలోని నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని గ్రామస్థులు సత్తెనపల్లిలోని వైద్యశాలకు తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ తరలించారని బంధువులు వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. వివాదంపై విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: