ETV Bharat / state

ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు - shamyul

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్... ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అన్ని వార్డులను పరిశీలించారు.

కలెక్టర్
author img

By

Published : Jul 13, 2019, 6:14 PM IST

గుంటూరు ప్రధానాస్పత్రిలో కలెక్టర్ తనిఖీలు

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో వసతులను జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆకస్మికంగా పరిశీలించారు. తనిఖీలు చేశారు. ఆస్పత్రిలో వివిధ వార్డుల్లో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. రోగులకు సహాయంగా వచ్చిన వారి ఫిర్యాదులపై స్పందించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పిల్లల వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని కలెక్టర్ ఆగ్రహించారు. సరైన వసతులు లేక ఒక మంచం పై ఇద్దరు ముగ్గురు పిల్లల తల్లులు ఉన్నారని.. అక్కడ సరైన సౌకర్యాలు లేవన్నారు. మరుగుదొడ్ల నిర్వహణలో నాణ్యత లోపించిందని.. కొన్ని చోట్ల పూర్తిగా బ్లాక్ అయినట్లు గమనించామనీ చెప్పారు. తమ పరిధిలోని సమస్యలను.. సత్వరమే పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని వెల్లడించారు.

ఇది కూడా చదవండి

60 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

Intro:Ap_Nlr_02_13_Nakili_Police_Arest_Cc_Vis_Kiran_Avb_AP10064

నాట్: సార్, స్క్రిప్ట్ 699 కిట్ ద్వారా పంపాను, పరిశీలించగలరు.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.