మహిళలకు రొమ్ము సంబంధిత సమస్యలన్నింటిని పరీక్షించుకోవడానికి, చికిత్స చేయడానికి.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వేదిక కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో కేర్ కేంద్రంలో ఏర్పాటు చేసిన బ్రెస్ట్ క్లినిక్‌ని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం మహిళా డాక్టర్లు, నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు.
రొమ్ము సంబంధిత వ్యాధిగ్రస్తులు.. ముందుగానే చికిత్స పొందితే ప్రమాదకర వ్యాధి నుంచి తప్పించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ పద్మావతి, ప్రొఫెసర్ ఎస్.ఎస్.వి రమణ, డాక్టర్ సుమిత్ర శంకర్, నాట్కో కోఆర్డినేటర్ అశోక్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.