గుంటూరు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మాజీఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మధ్య వార్ నడుస్తుంది. దీనిపై స్థానిక ప్రజల్లో చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గురజాల తెదేపా టిక్కెట్‌ను ఇవ్వబోమని పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారని... దీంతో ఆగ్రహానికి గురైన యరపతినేని తన ఉనికి కోసం ఏవేవో మాట్లాడుతున్నారని కాసు మహేష్ రెడ్డి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
దీనిపై యరపతినేని శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు. వరుసగా 6 సార్లు తెలుగుదేశం పార్టీ తరుపున గురజాల నుంచి పోటీ చేశానని... తనను విమర్శించే అర్హత కాసు మహేష్ రెడ్డికి లేదని యరపతినేని వ్యాఖ్యానించారు. తాను తల్చుకుంటే మరో పదిమందికి పార్టీలో టిక్కెట్ ఇప్పిస్తానని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో గురజాల నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. గురజాలలో చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని యరపతినేని పేర్కొన్నారు.