ముఖ్యమంత్రి జగన్ నరసరావుపేటకు చేరుకున్నారు. గోపూజ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో గోపూజ మహోత్సవానికి ఏర్పాట్లు చేశారు. ఇస్కాన్ సహకారంతో 108 గోవులకు కామధేను పూజను నిర్వహించనున్నారు. తితిదే ఆధ్వర్యంలో గంటపాటు కామధేను పూజ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాస్లు ఉన్నవారినే అనుమతిస్తామని అధికారులు తెలిపారు. సీఎం జగన్ అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:10 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.
ఇదీ చదవండి: బెజవాడ దుర్గ గుడిలో ఘనంగా గోపూజ మహోత్సం