ETV Bharat / state

Jagananna Smart Township Launched: మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేరబోతుంది: సీఎం జగన్‌ - smart townships launched by cm jagan

Jagananna smart town ship: మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకే జగనన్న స్మార్ట్ టౌన్​షిప్‌లను ప్రారంభించామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. సంవత్సర ఆదాయం 18 లక్షల వరకు ఉన్న వారికి అందుబాటు ధరల్లోనే ప్లాట్లు అందించనున్నట్లు తెలిపారు. ఎంఐజీ లేఅవుట్లు, వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఆయన...ప్రైవేటు వెంచర్ల కంటే మెరుగ్గా లేఅవుట్లలో అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు ప్రకటించారు.

Jagananna smart town ship
Jagananna smart town ship
author img

By

Published : Jan 11, 2022, 12:35 PM IST

Updated : Jan 11, 2022, 9:08 PM IST

మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేరబోతుంది: సీఎం జగన్‌

Jagananna Smart Township: లాభాపేక్ష లేకుండా మధ్యతరగతి వారికి మార్కెట్ ధర కన్నా తక్కువకే ఇళ్ల స్థలాలు అందించే 'జగనన్న స్మార్ట్ టౌన్​షిప్' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా నవులూరు, కడప జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏర్పాటు చేసిన ఎంఐజీ లే అవుట్లను..తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకునే ఎంఐజీ వెబ్ సైట్‌ను ఆయన ఆవిష్కరించారు.

ప్రతీ నియోజకవర్గానికి విస్తరిస్తాం
Jagananna smart town ship launched by Cm Jagan: ఎంఐజీ(MIG)ల్లో మూడు కేటగిరీల్లో స్థలాలు పంపిణీ ఉంటుందని సీఎం తెలిపారు. 150, 200, 240 చదరపు గజాల స్థలాలు ఎంచుకునే అవకాశం లబ్దిదారులకు కల్పిస్తున్నట్లు చెప్పారు. లిటిగేషన్ లేకుండా అభివృద్ధి చేసిన ప్లాట్లు అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎంఐజీలో 10 శాతం ప్లాట్లు 20 శాతం రిబేటుతో కేటాయిస్తామన్నారు. ఈ పథకాన్నిరాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి విస్తరిస్తామని ప్రకటించారు.

పచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చేలా..నిర్మాణం
జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలో రాష్ట్ర ప్రభుత్వమే సకల సదుపాయాలను కల్పిస్తుందన్నారు. కాలనీల్లో 50 శాతం స్థలాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామన్నారు. బీటీ రోడ్డు, డ్రైనేజీ, మంచినీటి సరఫరాతో పాటు పచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చేలా చూస్తామని చెప్పారు. ఎంఐజీల వల్ల వల్ల మిగిలిన ప్రాంతాల్లో ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్లలోనూ రేట్లు తగ్గుతాయని సీఎం అన్నారు. సాధారణ ప్రజలకు అప్పుడు అందుబాటు ధరల్లో పాట్లు లభిస్తాయన్నారు.

ఇదీ చదవండి:

Corona test guidelines: 'లక్షణాలు లేకుంటే కరోనా పరీక్ష అవసరం లేదు'

Last Updated : Jan 11, 2022, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.