గుంటూరు వాసవి కాంప్లెక్స్‌లో వస్త్ర దుకాణం నడుపుతున్న గ్రంధి మారుతి... అతన్ని నమ్మి డబ్బు చేబదులు ఇచ్చిన వారిని మోసం చేసి పరారయ్యాడు. కొన్ని సంవత్సరాలుగా నమ్మకంగా వ్యాపారం చేస్తున్న మారుతి వద్దకు వచ్చే చిన్న వ్యాపారులతో మంచి అనుబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. ఈ సత్సబంధాన్ని ఆసరాగా తీసుకొని వ్యాపారాన్ని విస్తరిస్తున్నామని చెప్పి కొంతమంది నుంచి చేబదులు కింది లక్షలు డబ్బు రాబట్టాడు.
దుకాణంకు వెళ్తే...
నెలలు గడుస్తున్నా మారుతి డబ్బు గురించి మాట్లాడకపోవటం, ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో దుకాణంకు వెళ్లారు. మారుతి ఐపీ పెట్టటంతో బ్యాంకు వారు ఆస్తులు స్వాధీనం చేసుకున్నారని తెలియటంతో బాధితులు కంగుతిన్నారు. తమను మారుతి మోసం చేశాడని గ్రహించి గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మారుతి నుంచి డబ్బు వసూలు చేసి తమకు చెల్లించి న్యాయం చేయాలనీ, లేకపోతే తమకు చావే శరణ్యం అంటూ బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
ఇదీ చదవండి: 'అర్హులందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ'