మందడంలో మహాధర్నాను అడ్డుకున్న పోలీసులు - మందడంలో దుకాణాలన్ని పోలీసులు మూయించారు వార్త
మందడంలో రైతుల మహాధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. రైతులు రహదారిపైకి రాకుండా ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి సచివాలయానికి వస్తున్నారంటూ పోలీసులు దుకాణాలు మూసివేయిస్తున్నారు. పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు దుకాణాలు మూసివేయించటంపై వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛందంగా బంద్ పాటించినప్పుడు బలవంతంగా షాపులు తెరిపించే ప్రయత్నం పోలీసులు.. సీఎం సచివాలయానికి వస్తుంటే దుకాణాలు తెరవవద్దని బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. సీఎం సచివాలయానికి వస్తే పోలీసులు బంద్ పాటిస్తారా అని నిలదీశారు.