ETV Bharat / state

నేడు రహదారిపైకి రాజధాని పోరు !

భారీ కవాతుతో తమ ఆక్రందన చాటిన అమరావతి రైతులు..ఇవాళ జాతీయ రహదారి దిగ్భందనానికి సిద్ధమయ్యారు. జీ.ఎన్. రావు, బోస్టన్‌ కమిటీ నివేదికలపై హైపవర్‌ కమిటీ సమావేశం జరగనుండటంతో అందుకనుగుణంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు.

author img

By

Published : Jan 7, 2020, 6:25 AM IST

నేడు రహదారిపైకి రాజధాని పోరు !
నేడు రహదారిపైకి రాజధాని పోరు !

రాజధాని రైతుల పోరు.... 21వరోజుకు చేరింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో రోజు రోజుకూ ఆందోళన ఉద్ధృతం చేస్తున్న అమరావతి ప్రాంత వాసులు నేడు మరో అడుగు వేస్తున్నారు. విజయవాడ-గుంటూరు జాతీయ రహదారి దిగ్భందనం చేయబోతున్నారు. మంగళగిరి మండలం చినకాకాని వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై జరిగే రహదారి ముట్టడిలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో పాటు తెలుగుదేశం, జనసేన, వామపక్షాల నేతలు పాల్గొన్నట్లు సమాచారం. 29 గ్రామాల ప్రజలు రహదారి దిగ్భందనానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే సకలజనులసమ్మె, రాజధాని బంద్‌, తుళ్లూరు నుంచి మందడం వరకు భారీ ర్యాలీలతో ఉద్యమవేడిని పెంచుతున్న రైతులు..ఇవాళ్టి జాతీయ రహదారి దిగ్భందనాన్ని ప్రతిష్టత్మకంగా తీసుకున్నారు. మహిళలు కూడా.. ధర్నాలు, రీలే దీక్షలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. రాజధానిగా అమరావతి సాధన కోసం చావోరేవో తెల్చుకుంటామని తెగేసి చెబుతున్నారు.

రహదారి దిగ్భందనాన్ని అడ్డుకునేందుకు పొలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 16వ నెంబర్‌ రహదారిపై రాజకీయ ఐకాస తలపెట్టిన ధర్నాకు అనుమతి లేదని చెబుతున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా 144సెక్షన్, 30పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామని..ఓ ప్రకటనలో పోలీసులు వెల్లడించారు.

నేడు రహదారిపైకి రాజధాని పోరు !

ఇదీచదవండి

రాజధాని తరలింపు 29 గ్రామాల సమస్య కాదు : చంద్రబాబు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.