గుంటూరు జిల్లాలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. పాతకక్షలు, భూ వివాదమే ఈ గొడవకు కారణమని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..