తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరులో పౌర సరఫరాల హమాలీలు నిరసన చేపట్టారు. రెండో రోజు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కూలీ రేటు గత డిసెంబర్ నాటికే ముగిసినా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ధరలు అమలు చేయలేదని వాపోయారు.
కరోనా విపత్తులోనూ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రభుత్వం అందించే రేషన్ సరకులను ప్రజలకు చేరువ చేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు వెలూగురి రాధాకృష్ణమూర్తి అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జనవరి 2020 నుంచి పెంచిన నూతన కూలీ రేట్ల జీవోను విడుదల చేయాలన్నారు.
ఇదీ చదవండి: