గుంటూరు జిల్లా కార్మిక శాఖ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులందరికీ పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇసుక కొరతను నివారించి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కార్మికులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.
'భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి'
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులందరికీ పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు..
గుంటూరు జిల్లా కార్మిక శాఖ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులందరికీ పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇసుక కొరతను నివారించి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కార్మికులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి: మంగళగిరిలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు