గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జి. చైతన్య సింధు నీట్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఆరో ర్యాంకు సాధించింది. 720 మార్కులకు 715 మార్కులతో సత్తా చాటింది. ఇటీవల విడుదలైన ఏపీ ఎంసెట్ ఫలితాల్లోను సింధుకు మెుదటి ర్యాంకు వచ్చింది. దిల్లీ ఎయిమ్స్ లో వైద్య విద్యా అభ్యసించాలనేది తన ఆకాంక్ష అని తెలిపిన సింధు.... ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత వైద్యరంగంలో పరిశోధనలు చేపట్టడమే తన లక్ష్యమని వెల్లడించింది.
సింధు తల్లిదండ్రులు సుధారాణి, కోటేశ్వరప్రసాద్ ఇద్దరు వైద్యులుగా పనిచేస్తున్నారు. ఆమె తాత సుబ్రహ్మణ్యం కూడా వైద్యుడే. ఇప్పుడు సింధు మంచి ర్యాంకు సాధించటంతో వారి కుటుంబంలో మూడో తరం వైద్య విద్యలోకి వెళ్తున్నట్లైంది.
ఇదీచదవండి